AP: ఏపీలోని మహిళలకు శుభవార్త.. జిల్లాల్లో ఫ్రీ బస్సు జర్నీ

Dhivi
Published on: 7 March 2025 6:42 AM IST
AP: ఏపీలోని మహిళలకు శుభవార్త.. జిల్లాల్లో ఫ్రీ బస్సు జర్నీ
X

AP: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు ఆమె ప్రకటించారు. మండలిలో గురువారం వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు సూపర్ సిక్స్ అమలును ప్రస్తావించగా..దానిపై మంత్రి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుందని ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు.

ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాలో ఫ్రీ జర్నీ అనే మేము చెప్పామని..ఈ విషయమై స్పష్టత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. బడ్జెట్ పై ఎమ్మెల్సీలు కల్యాణి, చంద్రశేఖర్ రెడ్డి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, వంకా రవీంద్ర తమ అభిప్రాయాలను వెల్లడించారు. మండలి ప్రారంభమైన వెంటనే సామాజిక పింఛన్ల మంజూరుపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేనురాజు తిరస్కరించారు. బడ్జెట్ పై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

Dhivi

Dhivi

Next Story