Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

Tirumala: ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల

Jyothi
Published on: 18 Aug 2022 6:35 AM IST
Good News For Srivari Devotees In Tirumala
X

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లులో ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story