TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..కాలినడన భక్తుల కోసం ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సులు

Good news for Srivari devotees  Free electric buses for walking devotees
x

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..కాలినడన భక్తుల కోసం ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సులు

Highlights

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజుల లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. కొందరు వాహనాల ద్వారా కొండపైకి...

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజుల లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. కొందరు వాహనాల ద్వారా కొండపైకి చేరుకుంటే..మరికొంత మంది భక్తులు తమ మొక్కు చెల్లించుకునేందుకు కాలిన నడకన వెళ్తారు. అలాంటి భక్తులకు శుభవార్త వినిపించనుంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తుల కోసం 20ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఉచితంగా నడపనుంది. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఫ్రీ ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. ఇదే అదనుగా జీపు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహాకారంతో బస్సులను కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories