Bhadrachalam: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. భద్రాచలంలో రెండో హెచ్చరిక జారీ

Bhadrachalam: 58 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు

Shekhar G
Published on: 27 July 2023 9:01 AM IST
Godavari River Overflows At Bhadrachalam First Warning Issued
X

Bhadrachalam: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. భద్రాచలంలో రెండో హెచ్చరిక జారీ

Bhadrachalam: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరదనీరు ఆలయ పరిసరాల్లోకి వచ్చి చేరింది. ఇక గోదావరి నదిలో అంతకంతకూ వరద పెరుగుతుండటంతో నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 50.2 అడుగులు కాగా.. 58 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story