గోదారి బోటు వెలికితీత పునఃప్రారంభం..ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో రెండోసారి ఆపరేషన్‌

గోదారి బోటు వెలికితీత పునఃప్రారంభం..ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో రెండోసారి ఆపరేషన్‌
x
Highlights

గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిన బోటును వెలికితీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి....

గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిన బోటును వెలికితీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి. గత నెల 30 న బోటు వెలికితీత పనులు ప్రభుత్వం సత్యం బృందానికి అప్పగించింది. లంగర్లు వేసి బోటును వెలికితీసేందుకు ప్రయత్నించింది. అయితే వరద ఉధృతి పెరగడంతో ఈ నెల 3 న పనులకు విరామం ఇచ్చారు. మళ్లీ ఇవాళ్టి నుంచి పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే కచ్చులూరుకు ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. గత నెల 15 న కచ్చులూరు దగ్గర బోటు మునిగిపోవడంతో ఇప్పటివరకు 38 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories