తిరుమల శ్రీవారికి గోదా మాలల సమర్పణ

Srivari Goda Malas:తిరుమల శ్రీవారి ఆలయంలో ''కాకబలి'' కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.

Arun Chilukuri
Published on: 16 Jan 2022 3:50 PM IST
తిరుమల శ్రీవారికి గోదా మాలల సమర్పణ
X

తిరుమల శ్రీవారికి గోదా మాలల సమర్పణ

Srivari Goda Malas: శ్రీగోదాదేవి పరిణయోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి మూలవిరాట్ కు పవిత్ర గోదా మాలలను సమర్పించారు. తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీగోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుంచి తిరుమల పెద్ద జియ‌ర్‌స్వామివారి మఠానికి చేరుకున్నాయి. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ''కాకబలి'' కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. కనుమ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని అర్చకులు, జీయంగార్లు వైదికోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని వెండి పళ్లెంలో తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ సంపంగి ప్రకారంలోని ధ్వజస్తంభం ప్రదక్షిగా ఆనంద నిలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story