తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆలయాలపై దాడులు

X
Highlights
తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంతపురంలోని పురాతన చెన్నకేశవస్వామి ఆలయ...
Arun Chilukuri17 Dec 2020 7:14 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంతపురంలోని పురాతన చెన్నకేశవస్వామి ఆలయ గోపురాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి పెయింటింగ్ పనులు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో గుడిలోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు గోపురంతో పాటు ఓ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శబ్దాలు రావడంతో బయటకొచ్చి చూసిన స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుప్తనిధుల కోసమే దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారా..? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
Web Titlegod statue vandalized in Chennakesava Swamy temple in Anantapur
Next Story