జీవో నెంబర్‌ వన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

GO No. 1: నేటి వరకు జీవో నెంబర్‌ వన్‌పై స్టే విధించిన ఏపీ హైకోర్టు

Jyothi
Published on: 23 Jan 2023 10:57 AM IST
GO No. 1 will be Heard in AP High Court Today
X

జీవో నెంబర్‌ వన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

GO No. 1: ఏపీ హైకోర్టులో ఇవాళ జీవో నెంబర్‌ వన్‌పై విచారణ జరగనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణ చేపట్టనుంది. జీవో నెంబర్ వన్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నెంబర్‌ వన్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోం అంటూ తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జనవరి 23న విచారణ జరిపించాలని ఆదేశించింది. ఇక, సుప్రీంకోర్టు ఆదేశంతో మరోసారి జీవో నెంబర్‌వన్‌పై తిరిగి ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.

Jyothi

Jyothi

Next Story