సీఎం జగన్ కు నివేదికను సమర్పించిన జీఎన్ రావు కమిటీ

సీఎం జగన్ కు నివేదికను సమర్పించిన జీఎన్ రావు కమిటీ
x
జీఎన్ రావు కమిటీ
Highlights

సీఎం జగన్ తో భేటీ అయిన జీఎన్ రావు కమిటీ రాజధానిపై నివేదిక సీఎంకు సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన జీఎన్ రావు కమిటీ ఆయా...

సీఎం జగన్ తో భేటీ అయిన జీఎన్ రావు కమిటీ రాజధానిపై నివేదిక సీఎంకు సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన జీఎన్ రావు కమిటీ ఆయా ప్రాంత ప్రజల నుంచి రాజధానిపై అభిప్రాయాలను సేకరించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది. అమరావతి, విశాఖ, కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి జీఎన్ రావు కమిటీ పరిశీలించింది.

ఈ నెల 27న జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి, రాజధానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. శివరామకృష్ణన్ నివేదిక ప్రకారం పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా, రాజధాని ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఏర్పాటు అయిన ఈ కమిటీ.. తాజా సీఎం జగన్ నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్ గా.. సీహెచ్ విజయమోహన్ సెక్రెటరీగా రాజదానిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ అంజలి కరోల్ మోహన్, డాక్టర్ ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, ప్రసాద్, తేజా సభ్యులుగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories