ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు

X
Highlights
Acid Attack: ప్రేమించి మోసం చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడుపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ...
Arun Chilukuri4 Sep 2020 7:17 AM GMT
Acid Attack: ప్రేమించి మోసం చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడుపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన నాగేంద్రకు ముఖంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సదరు యువతిని నాగేంద్ర ప్రేమించాడు. అయితే ఆమెతో పెళ్లికి అంగీకరించకపోవడమే కాకుండా ఇటీవలే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన సదరు యువతి వారం రోజుల క్రితం నాగేంద్రపై యాసిడ్‌తో దాడి చేసింది. అయినా శాంతించని యువతి నేడు మళ్లీ నాగేంద్రపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Web Titlegirlfriend Acid Attack on his lover in Kurnool district
Next Story