Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. టీవీ చూసేందుకు రమ్మని పిలిచి..

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం వెలుగుచూసింది.

Arun Chilukuri
Updated on: 20 Jun 2021 11:54 AM IST
Girl Molested in Srikakulam District
X

నిందితుడు అనిల్‌

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. అభం..శుభం తెలియని పసిమొగ్గపై కన్నేసిన కీచకుడు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాంకు చెందిన లొట్ట అనిల్ ఏడో తరగతి చదువుతున్న బాలికను ఇంట్లో టీవీ చూసేందుకు వస్త్తే నచ్చిన ప్రోగ్రాం చూసుకోవచ్చని నమ్మించాడు. దీంతో అనిల్ మాటలను నమ్మిన చిన్నారి అతని ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లింది. దీన్ని అనుకూలంగా మలుచుకున్న అనిల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారాని ఒడిగట్టాడు.

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదు చిన్నారి. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు కుమార్తెలో వచ్చిన శారీరక మార్పుతో ఆందోళన చెందారు. రాజాంలోని ఓ ఆసుపత్రికి తీసుకెల్లి వైద్యపరీక్షలు జరిపించారు. బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. కూతురును నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వివరించింది బాలిక. జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు బాలిక తల్లిదండ్రులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story