దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడ్డ విద్యార్థిని మృతి

Duvvada Railway Station: దువ్వాడ రైల్వేస్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని మృతిచెందింది.

Arun Chilukuri
Published on: 8 Dec 2022 3:26 PM IST
Girl Injured in Duvvada Railway Station Died
X

దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడ్డ విద్యార్థిని మృతి

Duvvada Railway Station: దువ్వాడ రైల్వేస్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని మృతిచెందింది. నిన్న రైలు దిగుతూ ప్రమాదానికి యువతి గురైంది. అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్ళేందుకు గుంటూరు-రాయగడ్ ఎక్స్ ప్రెస్ లో దువ్వాడ స్టేషన్ కు చేరుకుంది. రైలు దిగుతున్న క్రమంలో ఆమె కాలు రైలు, ఫ్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుపోయింది. ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కున్న విద్యార్థినికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతిచెందింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story