Gidugu Rudra Raju: ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

Gidugu Rudra Raju: రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు పంపిన రుద్రరాజు

Shekhar G
Published on: 15 Jan 2024 1:52 PM IST
Gidugu Rudra Raju Resigns As APCC President
X

Gidugu Rudra Raju: ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

Gidugu Rudra Raju: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలో చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు పంపినట్లు రుద్రరాజు తెలిపారు. త్వరలోనే ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపడుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మణిపూర్‌లో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా హాజరైన షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిపై ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే హైకమాండ్ ఆదేశాలతో రుద్రరాజు రాజీనామా చేసినట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story