Y S Jagan: ఓడిపోయామన్న భావనను మనసులోంచి తీసేయండి

Y S Jagan: కాలం గడుస్తున్నకొద్దీ.. మన పట్ల అభిమానం పెరుగుతుంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Jun 2024 6:22 PM IST
Get rid of the feeling of defeat Says Y S Jagan
X

Y S Jagan: ఓడిపోయామన్న భావనను మనసులోంచి తీసేయండి

Y S Jagan: ఓడిపోయామన్న భావనను మనసులోంచి తీసేయాలని సూచించారు మాజీసీఎం జగన్‌. తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంట్లో మనం చేసిన మంచి అలానే ఉందని, ప్రతీ ఇంటికి మనం తలెత్తుకుని పోగలమన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ.. మన పట్ల అభిమానం పెరుగుతుందని, మళ్లీ మనం రికార్డు మెజార్టీతో గెలుస్తామని ధైర్యాన్ని నింపారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనై ప్రజలు కూటమికి ఓట్లు వేశారని, ఓట్లేసి మోసపోతున్నవారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story