గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు

X
Highlights
విశాఖ గీతం యూనివర్శిటీలో అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. గీతంకి...
Arun Chilukuri24 Oct 2020 3:54 AM GMT
విశాఖ గీతం యూనివర్శిటీలో అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. గీతంకి వెళ్లే బీచ్ రోడ్ మార్గాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. గీతంలో ఆక్రమణలపై గతం నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు ఎందుకు కూల్చుతోందో చెప్పడం లేదని యాజమాన్యం అంటోంది. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో బీచ్ రోడ్డు మీదుగా గీతం విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు రెండువైపులా మూసివేశారు. కూల్చివేత సమాచారం తెలిసి టీడీపీ శ్రేణులు వర్సిటీ వద్దకు చేరుకున్నాయి.
Web TitleGeetam University buildings Demolition in Visakhapatnam
Next Story