కోనసీమ జిల్లా శివకోడులోని ఆక్వా చెరువు వద్ద గ్యాస్ లీక్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Konaseema District: బోరులో నుంచి ఎగిసిపడుతున్న అగ్నికీలలు

Jyothi
Published on: 15 July 2023 9:05 AM IST
Gas leak at Aqua Pond in Sivakodu Konaseema District
X

కోనసీమ జిల్లా శివకోడులోని ఆక్వా చెరువు వద్ద గ్యాస్ లీక్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు 

Konaseema District: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు వద్ద గ్యాస్ లీక్ అయింది. దీంతో బోరులో నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ONGC అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

భారీగా అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. దీంతో మంటలను ఎలా ఆర్పాలన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. గ్యాస్ లీక్‌ అవడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఉదృతంగా ఎగసిపడుతున్న మంటలను చూసి ఆందోళన చెందుతున్నారు.

Jyothi

Jyothi

Next Story