Tirumala: తిరుమలలో వైభవంగా గరుడ సేవ

Tirumala: మాడా వీధుల్లో ఊరేగిన మలయప్పస్వామి

Jyothi
Published on: 28 Nov 2023 7:43 AM IST
Garuda Seva in Tirumala
X

Tirumala: తిరుమలలో వైభవంగా గరుడ సేవ 

Tirumala: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.. సర్వాలంకర భూషితుడైన మలయప్ప స్వామివారు తన ప్రియ భక్తుడైన గరుడినిపై అధిష్టించి వాహన మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. శోభాయమానంగా నాలుగుమాడా వీధులలో ఊరేగిన శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

అడుగడుగునా గోవింద నామస్మరణల, కళకారుల ప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ కన్నులపండువగా సాగింది.. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

Jyothi

Jyothi

Next Story