logo
ఆంధ్రప్రదేశ్

Steel Plant: నిర్మలా సీతారామన్‌ స్టేట్‌మెంట్‌ దారుణం -గంటా

Ganta Srinivasa Rao Reacted to Nirmala Sitharaman Statement
X

నిర్మల సీతారామన్ & గంట శ్రీనివాస రావు (ఫైల్ ఫోటో)

Highlights

Steel Plant: ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి -గంటా * ఉద్యమానికి మంత్రి కేటీఆర్‌ మద్దతు ప్రకటించడం సంతోషకరం -గంటా

Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మద్దతు ప్రకటించడం ఆనందకరమని అన్నారు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. అవసరమైతే ఉద్యమంలో కూడా పాల్గొంటానని మంత్రి కేటీఆర్‌ చెప్పడం మంచి పరిణామమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు గంటా.

కార్మికులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తుంటే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పడం దారుణమని అన్నారు గంటా. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని అందుకోసం అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు.. ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించి, ముందుకు రావాలని అన్నారు గంటా.

Web TitleSteel Plant: Ganta Srinivasa Rao Reacted to Nirmala Sitharaman Statement
Next Story