Top
logo

మరో పార్టీలో గంట మోగడం ఖాయమన్న ప్రచారంలో నిజముందా?

మరో పార్టీలో గంట మోగడం ఖాయమన్న ప్రచారంలో నిజముందా?
Highlights

రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. గెలిచినా, ఓడినా నిశ్శబ్దాన్ని చేధించే శబ్దం ఆయన. పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా...

రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. గెలిచినా, ఓడినా నిశ్శబ్దాన్ని చేధించే శబ్దం ఆయన. పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంటా మోగాల్సిందేనన్నది ఆయన ఫిలాసఫీ. ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది. కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది. అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయన, ఇప్పుడు ఏ పార్టీలో అధికార గంట మోగించాలా అని మేథో మథనం సాగిస్తున్నారట. ఫ్యాన్ చెంతకు వెళ్లి సేదతీరాలా రారా రమ్మంటున్న పువ్వు పరిమళానికి ఆకర్షితుడు కావాలా అని ఆలోచిస్తున్నారట. తన పొలిటికల్ ఫ్రెండ్స్ సుజనా తిన్నావా అంటూ పలకరిస్తున్నా, సీఎం రమేష్‌ రారమ్మంటున్నా, వెళ్లాలా వద్దా అని తెగ థింక్ చేస్తున్నారట. గలగల గంట మోగించే ఆయన, కొన్నాళ్లుగా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు ఆయన మౌనం వెనక దాగిన మర్మమేంటి?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు....పార్టీ ఏదైనా అధికార దర్పం గంట మోగించే లీడర్...ఆహార్యానికి కార్పోరేట్ లీడర్‌లా వున్నా, పొలిటికల్ ప్లానింగ్‌లో మాత్రం మాస్, క్లాస్‌ను మిక్స్‌ చేసి, హోరెత్తించే నాయకుడిగా చెబుతారు. ఎన్నికలు వచ్చినా ప్రతిసారీ నియోజకవర్గం మార్చినా, పార్టీలు మారినా విజయ పరంపర మాత్రం కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన 2019 ఎన్నికలో కూడా గంటా శ్రీనివాసరావు పోటీపై హైడ్రామా నడిచింది. మొదట భీమిలి నియోజకవర్గం కావాలని పట్టుబట్టినా, తరువాత ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చే తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ విశాఖపట్నం ఉత్తరంకు షిఫ్ట్ అయ్యారు. ఫలితాల్లో టీడిపీ ఓడిపోయినా గంటా మాత్రం, విజయగంట మోగించారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడి నుంచే మొదలైంది.

గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచినా, పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడంతో పదవి లేక పక్కన కూర్చోవలసి వచ్చింది. అయితే గంటా శ్రీనివాసరావు పార్టీ మారైనా పదవి సంపాదిస్తారన్న పొలిటికల్ కామెంట్స్ చాలానే వినిపించాయి. వైసీపీలోకి వెళ్లి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని ఆయన గట్టిగా అనుకున్నారట. కానీ పార్టీలోకి రావాలంటే, రాజీనామా చేసి రావాలన్న సీఎం జగన్‌ నిబంధన, గంటాకు బంధనాలు బిగించింది. దీంతో చేసేదేమీలేక ఆయన అలాగే ఉండిపోయారన్న చర్చ జరగింది. మరో తలుపు తట్టేందుకు సిద్దమయ్యారన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్.

ఇక మిగిలినది పువ్వు గుర్తు పార్టీ కమలదళం మాత్రమే. బీజేపిలోకి గంటా వెళుతున్నారన్న ప్రచారం చాలా రోజులు నుంచి వినిపిస్తోంది. గతంలో టీడీపీకి చెందిన 16 మంది ఎమ్ముల్యేలతో బీజేపిలోకి, వెళ్లేందుకు ముహర్తం షూరూ ఫిక్స్ చేశారన్న వార్తలు కూడా భగ్గుమన్నాయి. అదంతా సామాజిక వర్గం సమావేశం మాత్రమేనని చిత్రీకరించారు. పార్టీ మారతారన్న ప్రచారంలో నిజంలేదని ఆయనే ఖండించినా, రాను రాను సైలెంట్ అయిపోవడం, పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గంలో అధికారిక కార్యక్రమాలకు దూరంగా వుండటంతో, మళ్లీ పార్టీ మార్పు ప్రచారం జోరందుకుంది. దీనికితోడు అసెంబ్లీ అంత హాట్‌హాట్‌గా జరిగినా, గంటా మాత్రం సైలెంట్‌గా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలమిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మౌనం వీడి మాట్లాడితే తప్ప పొలిటికల్ కామెంట్స్‌ కు, సెటైర్లకు ఫుల్ స్టాప్ పడేలా లేదు.

Next Story

లైవ్ టీవి


Share it