జగన్ బలహీనమైన నాయకుడు.. గంటా సంచలన వ్యాఖ్యలు..

Ganta Srinivas: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఎంతో బలవంతుడిని అనుకున్నారని...

Arun Chilukuri
Published on: 14 April 2022 4:33 PM IST
Ganta Srinivasa Rao Key Reamarks on Jagan on Cabinet Expansion
X

జగన్ బలహీనమైన నాయకుడు.. గంటా సంచలన వ్యాఖ్యలు..

Ganta Srinivas: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఎంతో బలవంతుడిని అనుకున్నారని, కానీ కేబినెట్ విస్తరణ తరువాత ఆయన ఎంత బలహీనుడో తేలిపోయిందని ఎద్దేవా చేశారు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కేబినెట్ కూర్పుపై అసమ్మతితో దిష్టిబొమ్మలు, టైర్లు తగలబెట్టడం మొదటిసారిగా చూస్తున్నానన్నారు. ఆర్ధిక రాజధాని విశాఖ జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవటం విశాఖపై జగన్ కు ఉన్న అభిమానం ఏపాటిదో తెలుస్తుందన్నారు.

ఎన్నికలకి రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామంటే ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేదన్నారు. వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా.. టీడీపీకి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీకి బీసీలను ఎవరూ దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచి పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ టీడీపీలోకి వలసలు ఎక్కువవుతాయని గంటా స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story