Ganta Srinivasarao: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి గంటా..

Ganta Srinivasa Rao: తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతుందని

R Tripura Malini
Published on: 12 Dec 2022 3:35 PM IST
Ganta Srinivasa Rao Gave Clarity On The Political Status
X

రాజకీయ ప్రస్థానంపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు 

Ganta Srinivasa Rao: విశాఖలో వంగవీటి రంగా 34వ వర్ధంతి సభకు సబంధించి కాపునాడు సభ్యులు పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 26న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు పాల్గొననున్నారు. తన పొలిటికల్ కెరియర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు గంటా. తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతుందన్నారు. తన ప్రమేయం లేకుండానే డేటు, టైం కూడా ఫిక్స్ చేస్తున్నారాయన... ఏం రాసుకున్నా... ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదని గంటా స్పష్టం చేశారు. అవసరమైన సందర్భంలో తానే చెప్పాల్సింది చెప్తానన్నారు. గంట కామెంట్స్‌తో విశాఖలో ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story