అంబటి తీరుపై గల్లా మాధవి ఆగ్రహం.. 'చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు'!

Arun Chilukuri
Published on: 3 Feb 2026 3:29 PM IST
అంబటి తీరుపై గల్లా మాధవి ఆగ్రహం.. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు!
X

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు తన తప్పు తెలుసుకోకుండా 'రివర్స్ డ్రామా' ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.

అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై కూడా ఎమ్మెల్యే మాధవి ఘాటుగా స్పందించారు. "అంబటి రాంబాబు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అందరి గుండెల్లో మంటలు రగిల్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తప్పు చేసి క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. ఎదురుదాడికి దిగడం ఆయన అహంకారానికి నిదర్శనం" అని మాధవి విమర్శించారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయాల్లో మరెవరూ చేయలేదని, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story