చంద్రబాబు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా? : గడికోట శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా? : గడికోట శ్రీకాంత్ రెడ్డి
x
Highlights

ఉనికి కోసమే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. బురద చల్లడమే తన విధానం అన్నట్టు...

ఉనికి కోసమే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. బురద చల్లడమే తన విధానం అన్నట్టు వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్ మండిపడ్డారు. చంద్రబాబు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా? అని ప్రశ్నించారు. కొవిడ్ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ తొలగించినట్లు వివరించారు.

ఏ అర్హత ఉందని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ప్రశ్నించిన శ్రీకాంత్.. ప్రజలను పట్టించుకోని చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని వ్యాఖ్యానించారు. కష్టకాలంలో రూ.70వేల కోట్లు ప్రజలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ప్రభుత్వం ఇచ్చే ప్రతిపైసా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలను సీఎం జగన్ ఆదుకున్నారు. 9 నెలల్లో అమరావతికి చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చారు? మీరు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలను చూసి పారిపోయింది చంద్రబాబు, లోకేషేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories