G-20 సదస్సుకు ముస్తాబైన విశాఖ నగరం.. 40దేశాల నుంచి హాజరుకానున్న 200మంది ప్రతినిధులు

G20 Summit 2023 at Visakhapatnam
x

G-20 సదస్సుకు ముస్తాబైన విశాఖ నగరం.. 40దేశాల నుంచి హాజరుకానున్న 200మంది ప్రతినిధులు

Highlights

G20 Summit 2023 at Visakhapatnam: సాగరతీర నగరం ప్రపంచదేశాల ప్రతినిధులకు ఆతిధ్యమివ్వబోతోంది.

G20 Summit 2023 at Visakhapatnam: సాగరతీర నగరం ప్రపంచదేశాల ప్రతినిధులకు ఆతిధ్యమివ్వబోతోంది. జీ20 సదస్సుకు వేదికగా నిలిచే క్రమంలో విశాఖ సర్వ హంగులతో స్వాగతిస్తోంది. ఇప్పటికే జాన్ బాగ్ధరీ కార్యక్రమాలు ప్రారంబించారు.. మరో వైపు దాదాపు 40 దేశాల నుండి డేలిగెట్స్ హాజరు అవుతున్నారు. వచ్చే అతిధిలు కోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగర సుందరీకరణ పనులు పూర్తి చేసారు. లాండ్ స్కప్స్, వాటర్ పొంటైన్స్, పార్కింగ్, వాల్ పెయింటింగ్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యానవనాలు, పార్క్ లు, బీచ్ లు సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దారు.

జీ20 లో ఉన్న 20 దేశాల ప్రతినిధిలు మరో 26 దేశాల నుండి డెలిగేట్ రానున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ సదస్సుకి రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరు అవుతున్నారు. అయితే వివిఐపి విజిట్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాల ప్రతినిధుల విశాఖ నగరంపట్ల సంతృప్తి చెందాలనే లక్ష్యంతో సుందరీకరణ పనులుచేపట్టామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజబాబు తెలిపారు.

సదస్సుల పేరు చెప్పి అవసరమైనపుడల్లా అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రెండు రోజుల సదస్సు కోసం 150 కోట్లు జీవీఎంసీ నిధులు ఎలా ఖర్చు చేస్తారనే ప్రశ్నిస్తున్నారు. అతిథులు తిరిగే ప్రాంతలో ఈ డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టి మొప్పు పొందడమేంటని అధికారులను నిలదీస్తున్నారు. నగర పరిధి దాటి వెళ్తే కనీసం వీధి దీపాలు కూడా వేయడం లేదని ప్రతిపక్ష నేతలు విచారం వ్యక్తంచేస్తున్నారు. గోడల మీద పెయింటిగ్ లు మొక్కలు నాటడం వలన ప్రజల అవసరాలు తీరవని నిజంగా చితసుద్ధి ఉంటే ప్రజలకి మౌళిక వసతుల కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ జీ20 సదస్సు తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే విధంగా అభివృద్ధి అవసరమే..కానీ అది ప్రజా హితంగా జరగలనేది ఈ ప్రాంత ప్రతినిధులు మాట. మరి అధికారులు ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని అడుగులు వేయాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories