సైనిక లాంఛనాలతో వీర జవాన్‌ జవాన్‌ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు

Jashwanth Reddy: జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం * అంత్యక్రియల్లో పాల్గొన్న హోం మంత్రి సుచరిత

Sandeep Eggoju
Updated on: 10 July 2021 1:15 PM IST
Funeral of a Brave Soldier With Military Paraphernalia
X

జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు (ఫైల్ ఇమేజ్)

Jashwanth Reddy: జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్‌ కూన రఘుపతి పాల్గొన్నారు. సీఎం జగన్‌ ప్రకటించిన 50 లక్షల సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంత్యక్రియల్లో భారీ ఎత్తున జనం పాల్గొన్నారు. 'జై జవాన్‌' అంటూ నినాదాలు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story