ఐదు పైసలకే ఫుల్ మీల్స్.. బంపర్ ఆఫర్ కు భారీ రెస్పాన్స్..!

Full Meals for 5 Paisa: విజయవాడలో 5 పైసలకే ఫుల్ మీల్స్ ఇస్తామని ఓ వ్యాపారి ప్రకటన ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 2 Dec 2022 5:32 PM IST
Full Meals for 5 Paisa in Vijayawada
X

ఐదు పైసలకే ఫుల్ మీల్స్.. బంపర్ ఆఫర్ కు భారీ రెస్పాన్స్..!

Full Meals for 5 Paisa: విజయవాడలో 5 పైసలకే ఫుల్ మీల్స్ ఇస్తామని ఓ వ్యాపారి ప్రకటన ఇచ్చారు. హోటల్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో ప్రకటన చూసిన జనం క్యూ కట్టారు. రూ.400 విలువ గల తాలీ 5 పైసలకే ఇస్తామని ప్రకటించారు. దీంతో హోటల్‌లోకి జనాలు పరుగులు పెట్టారు. ఐదు పైసల కాయిన్స్‌తో హోటల్ బయట పడిగాపులు గాశారు. 1100లకు పైగా ఐదు పైసల కాయిన్స్ వచ్చాయని హోటల్ యజమాని చెప్పారు. అయితే మొదటి 50 మందికి మాత్రమే ఉచిత తాలీ ఇస్తామని చెప్పారు.. క్రౌడ్ పెరిపోవడంతో యాజమాన్యం చేతులెత్తేసింది. మిగిలిన వారికి సగం రేటుకే మీల్స్ పెట్టారు. కేవలం తమ హోటల్ పబ్లిసిటీ కోసమే ఈ కాన్సెప్ట్ రూపొందించామని, ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించామని హోటల్ యజమాని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story