Tirumala: 35 నిమిషాల్లో ఖాళీ అయిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లు

Tirumala: ఉ.9 గంటలకు టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 1:56 PM IST
Full Demands to TTD Sarva Darshan Tickets
X

శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ (ఫైల్ ఇమేజ్)

Tirumala: శ్రీవారి సర్వదర్శనం అక్టోబర్ నెల కోటా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా ఊహించని రీతిలో అరగంటలోపే ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు.

గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని జియో సహకారంతో ఆ సంస్థ సర్వర్లను వినియోగించి టికెట్లను విడుదల చేశారు. టీటీడీ వెబ్‌సైట్‌కు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగినా సర్వర్లపై ఒత్తిడి పడకుండా వర్చువల్ క్యూ పద్దతిలో టికెట్లను కేటాయించారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదా దర్శనానికి 72 గంటల ముందు టెస్ట్ చేసుకున్న కొవిడ్ నెగిటివ్ రిపోర్టుతో తిరుమలకు రావాలని టీటీడీ సూచించింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story