TTD Tickets: శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు విడుదల

*23 నిమిషాల్లో ఉచిత దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు *నవంబర్ నెలకు సంబంధించి 3 లక్షల టికెట్లు విడుదల

Shilpa
Published on: 23 Oct 2021 11:56 AM IST
Free Tickets Released for Srivari Darshan in TTD
X

టీటీడీ (ఫైల్ ఫోటో)

TTD Tickets: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లు విడుదల చేసింది టీటీడీ. నవంబర్‌ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. 23 నిమిషాల్లో ఉచిత దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు.

అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్లను సెప్టెంబర్‌ 26న టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా అరగంటలోపే ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు.



Shilpa

Shilpa

Next Story