వైసీపీ ఎమ్మెల్సీకే టోకరా వేయబోయాడు.. చివరకు..

వైసీపీ ఎమ్మెల్సీకే టోకరా వేయబోయాడు.. చివరకు..
x
Highlights

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. బ్యాంకు అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేస్తే..

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. బ్యాంకు అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేస్తే రూ.25 లక్షలు ఋణం వస్తుందని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్సీకె ఓ వ్యక్తి టోకరా వేయబోయాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌కి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన పేరు బాబు జగ్జీవన్‌రావ్‌ అని పరిచయం చేసుకున్నాడు, సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానని.. ప్రజాప్రతినిధులు రూ.50 వేలు చెల్లిస్తే అప్ ఆసరాల నిమిత్తం ప్రభుత్వం రూ.25 లక్షల రుణమిస్తుందని చెప్పాడు. అంతేకాదు ఈ డబ్బును జమ చేసేందుకని తెలంగాణలోని జగ్గారెడ్డి గూడెం బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను పంపించాడు. అయితే అతడి మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో ఈ విషయాన్నీ వెంటనే ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆమె.

ఆయన వెంటనే స్పందించి సీఎం కార్యాలయంలో దీనిపై ఎంక్వయిరీ చేయించారు. అయితే అక్కడ అలాంటి స్కీములు లేవనే సమాధానం వచ్చింది. ఎవరో కావాలనే డబ్బుకోసం ఇలా చేసి ఉంటారని ఎమ్మెల్సీ జకియా ఖానంకు చెప్పారు శ్రీకాంత్ రెడ్డి.. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్‌ సీఐని శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. కాగా ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు జకియా ఖానం. ఆమె భర్త వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన అనారోగ్యంతో మరణించారు. దాంతో ఎమ్మెల్సీగా ఆమెను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories