అనకాపల్లిలో నాలుగో విడత ఇంటింటి సర్వే

అనకాపల్లిలో నాలుగో విడత ఇంటింటి సర్వే
x
Highlights

అనకాపల్లి: కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. నాలుగో విడత చేపట్టిన సర్వేలో...

అనకాపల్లి: కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. నాలుగో విడత చేపట్టిన సర్వేలో భాగంగా గ్రామంలోని 24 వేల ఇళ్లకు వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిని యాప్​లో నమోదు చేస్తున్నారు.

అనుమానం ఉన్న వారికి కొవిడ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న లక్ష మంది ఆరోగ్య వివరాలు సేకరించేలా ఈ నెల 24వ తేదీ వరకు సర్వే చేపడుతున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories