కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

Arun Chilukuri
Published on: 2 Nov 2020 9:23 AM IST
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం
X

కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో ఎర్రచందనం తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.

కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్‌ రోడ్డు మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లోనే వెనుక వస్తున్న స్కార్పియో టిప్పర్‌ డీజిల్‌ ట్యాంక్​ని ఢీకొట్టింది.

డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఎర్రచందనం ఉన్న రెండో కారులో నలుగురు సజీవ దహనమయ్యారు. మొదటి కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు గాయపడగా వారిని రిమ్స్ కు తరలించారు. స్మగ్లర్లు కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారడంతో వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా పోలీసులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story