Guntur: గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నాప్ కలకలం

*నాలుగు రోజుల పసికందు అపహరణ *చిన్నారిని పక్కనపెట్టి నిద్రపోయిన అమ్మమ్మ *శిశువును సంచిలో పెట్టి తీసుకెళ్లిన కిడ్నాపర్

Shilpa
Published on: 16 Oct 2021 11:14 AM IST
Four Days Baby Kidnapped at GGH in Guntur Andhra Pradesh
X

గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నాప్ కలకలం(ఫైల్ ఫోటో)

Guntur: గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. నాలుగు రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. చిన్నారిని పక్కనపెట్టి అమ్మమ్మ నిద్రపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ జంట పసికందును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. శిశువును సంచిలో పెట్టి కిడ్నాపర్ తీసుకెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. మరోవైపు శిశువదృశ్యంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Shilpa

Shilpa

Next Story