Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు.
Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Kavuri Sambasiva Rao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. 82వ ఏట తన తుదిశ్వాస విడిచారు. 1943 అక్టోబర్ 1న జన్మించిన కావూరి సాంబశివరావు.. వరంగల్ NITలో ఉన్నత విద్యను అభ్యసించాడు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. కాంగ్రెస్ నుంచి ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన సాంబశివరావు.. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
8,9, 12,14,15వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన సాంబశివరావు.. మన్మోహన్ కేబినెట్‌లో జౌళి శాఖకు కేంద్రమంత్రిగా వ్యవహరించారు. 2013లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా 2014లో కాంగ్రెస్‌ను వీడారు. తన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనని ప్రకటించి... బీజేపీలో చేరారు.




