Harirama Jogaiah: జనసేన అధినేత పవన్‌కు మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖ

Harirama Jogaiah: బీసీలకు డిక్లరేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం

Shashank Gullapelli
Published on: 19 March 2024 9:39 PM IST
Former MP Harirama Jogaiah Letter To Janasena Chief Pawan Kalyan
X

Harirama Jogaiah: జనసేన అధినేత పవన్‌కు మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖ

Harirama Jogaiah: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖ పర్వం కొనసాగుతోంది. బీసీలకు డిక్లరేషన్ ద్వారా 11 హామీలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందించదగిన విషయమేనని.. లేఖలో హరిరామజోగయ్య ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే.. రాబోయే టీడీపీ, జనసేన కూటమితోనే బీసీలకు ఎక్కువ లబ్ది జరిగే అవకాశం ఉందని హరిరామజోగయ్య అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కాపులకు కూడా బీసీలతో సమానమైన సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని పవన్ కళ్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ రాశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story