Gollapalli Surya Rao: సైకిల్‌కు గుడ్‌బై.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు

Gollapalli Surya Rao: ఇప్పటికే ఎంపీలు మిథున్‌రెడ్డి, కేశినేని నానితో సూర్యారావు చర్చలు

Jyothi
Published on: 28 Feb 2024 9:53 AM IST
Former MLA Gollapalli Surya Rao Will join YCP
X

Gollapalli Surya Rao: సైకిల్‌కు గుడ్‌బై.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు

Gollapalli Surya Rao: టీడీపీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. ఆశలు పెట్టుకున్న తమకు అవకాశం ఇవ్వలేదంటూ పార్టీని వీడేందుకు ఒక్కొక్కరు సిద్ధమవుతున్నారు. రాజోలు టికెట్ ఆశించి భంగపడ్డ గొల్లపల్లి సూర్యారావు ఇవాళ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. రాజోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై అసంతృప్తిలో ఉన్న సూర్యారావు.. ఎంపీలు మిథున్‌రెడ్డి, కేశినేని నానితో భేటీ అయ్యారు. టీడీపీలో సామాజిక అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్న సూర్యారావు.. ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలవనున్నారు.

Jyothi

Jyothi

Next Story