Chintamaneni: న్యాయవ్యవస్థపై మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదం

Chintamaneni: వైసీపీ నేతలకు న్యాయవ్యవస్థపై గౌరవం లేదు

Shekhar G
Updated on: 23 Sept 2023 7:16 PM IST
Former MLA Chintamaneni Slams YCP Leaders
X

Chintamaneni: న్యాయవ్యవస్థపై మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదం

Chintamaneni: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతూ ఇప్పుడు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగిందనడం హాస్యాస్పదమన్నారు. ఇన్నాళ్లు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై గౌరవం లేకుండా వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు చింతమనేని.

Shekhar G

Shekhar G

Next Story