Former Minister Khaleel Basha Passes Away: మాజీ మంత్రి ఖలీల్ బాషా‌ కన్నుమూత

Former Minister Khaleel Basha Passes Away: మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు.

Karampoori Rajesh
Published on: 11 Aug 2020 10:03 PM IST
Former Minister Khaleel Basha Passes Away: మాజీ మంత్రి ఖలీల్ బాషా‌ కన్నుమూత
X

Former Minister Khaleel Basha Passes Away: మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఖలీల్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. బాషా అంత్యక్రియలు బుధవారం కడప జిల్లాలో జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు.

కాగా.. టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అనంతరం గతేడాది ఫిబ్రవరిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story