ఏపీ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

Ravela Kishore Babu: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల్ కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Updated on: 16 May 2022 5:46 PM IST
Former Minister Ravela Kishore Babu Quits BJP
X

ఏపీ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

Ravela Kishore Babu: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల్ కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. ప్రధాని మోదీ అవినీతిరహిత, సుస్థిరమైన, సమర్థవంతమైన పాలనా విధానాలు నచ్చడంతో బీజేపీలో చేరినట్లు వివరించారు. మోదీ మీద ఉన్న గౌరవం తనను మరింత బీజేపీ వైపు ఆకర్షింపజేశాయని లేఖలో చెప్పారు.

పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోము వీర్రాజుకు రాసిన లేఖలో రావెల వివరించారు. కాగా, రావెల కిషోర్ బాబు కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే రావెల కిషోర్ బాబు మళ్లీ టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story