Kakani Govardhan Reddy: వైఎస్సార్ సీపికి బిగ్ షాక్..మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

Former Minister Kakani Govardhan Reddy arrested
x

Kakani Govardhan Reddy: వైఎస్సార్ సీపికి బిగ్ షాక్..మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

Highlights

Kakani Govardhan Reddy: వైఎస్సార్ సీపికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు,...

Kakani Govardhan Reddy: వైఎస్సార్ సీపికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో ఆయన నాలుగవ నిందితుడిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణిని గుంటూరు రేంజ్ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముందుగా హైదరాబాద్ లో రెండు బ్రుందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అనంతరం బెంగళూరులో కూడా సెర్చ్ చేశారు. చివరకు కేరళలో పట్టుకోవడం తమకు సాధ్యమైందని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా బెయిల్ ఇవ్వనుందని స్పష్టం చేసింది. లాయర్లు ఎంత వాదించినా ముందస్తు బెయిల్ ఇచ్చే పరిస్ధితిలో లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే కాకాణికి న్యాయపరంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories