logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి దేవినేని ఉమా

Former Minister Devineni Uma Went into hiding
X

Andhra Pradesh: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి దేవినేని ఉమా

Highlights

Andhra Pradesh: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అజ్ఞాతంలోకి వెళ్లారు.

Andhra Pradesh: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సీఐడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడినట్టు మార్పింగ్ వీడియోలను ప్రెస్ మీట్‌లో చూపించినందుకు మాజీ మంత్రి దేవినేని ఉమాపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 15, 19 రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి స్పందన రాకపోయేసరికి అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లారు. నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న ఉమాపై సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 464, 468, 470, 471, 505, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉమా ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Web TitleFormer Minister Devineni Uma Went into hiding
Next Story