Kethireddy Venkatarami Reddy: వైసీపీకి కేతిరెడ్డి గుడ్‌బై..? క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే..

Kethireddy Venkatarami Reddy: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొట్టిపారేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Sept 2024 2:15 PM IST
Kethireddy Venkatarami Reddy: వైసీపీకి కేతిరెడ్డి గుడ్‌బై..? క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే..
X

వైసీపీకి కేతిరెడ్డి గుడ్‌బై..? క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే..

Kethireddy Venkatarami Reddy: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొట్టిపారేశారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది. దీనిపై స్పందించిన కేతిరెడ్డి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.

ఏపీలో రాజకీయాలు చేసినంత కాలం వైయస్ కుటుంబంతోనే ఉంటామని గత 35 సంవత్సరాలుగా మా కుటుంబం వైయస్ కుటుంబానికి అండగా నిలబడిందని కేతిరెడ్డి అన్నారు. పదవులు ఉన్నాలేకపోయినా వైఎస్ కుటుంబంతోనే ఉంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. జగన్ కుటుంబానికి సంబంధించిన వారు పార్టీ మారుతున్నారు కానీ తాను మారనన్నారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. నన్ను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నాను అంటూ స్పష్టం చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story