Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడదల రజని హౌస్ అరెస్ట్

Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడదల రజని హౌస్ అరెస్ట్
x
Highlights

Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న ఆందోళనలో భాగంగా చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి విడదల రజనిని పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ ఆరెస్ట్ చేశారు. ప్రభుత్వం, పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తక్షనమే వెనక్కి తీసుకోవాలని YSRCP డిమాండ్ చేసింది. కృష్ణజిల్లా మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాళాశాలను ముట్టడించే ప్రయత్నం చేశారు వైపీసీ నాయకులు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కళాశాలలను ప్రైవేట్ భాగస్వామ్యం రూపంలో ప్రైవేట్ వక్తులకు కట్టబెడుతుందని ఆరోపించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరింకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories