బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ఢిల్లీలో పార్టీ నేతల సమక్షంలో చేరిక

Jyothi
Updated on: 7 April 2023 12:56 PM IST
Former Andhra CM Kiran Kumar Reddy joins BJP
X

బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కమలం కండువా కప్పి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. తన కుటుంబం కాంగ్రెస్ పార్టీతో 60 ఏళ్లకు పైగా అనుబంధం కలిగి ఉందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతుండటంపై కిరణ్‌కుమార్‌రెడ్డి తనదైన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోతూ వచ్చిందని గుర్తుచేశారు.

Jyothi

Jyothi

Next Story