నిరుద్యోగులకు శుభవార్త.. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ..

నిరుద్యోగులకు శుభవార్త.. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ..
x
Highlights

అటవీ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ శాఖ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంబలకొండ ఎకో టూరిజం పార్కులో జరిగిన అటవీ...

అటవీ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ శాఖ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంబలకొండ ఎకో టూరిజం పార్కులో జరిగిన అటవీ అమరవీరుల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అటవీ సంపద, వన్యప్రాణులను పరిరక్షించుకుంటూ ప్రాణాలు అర్పించిన అటవీ అధికారులకు గౌరవం ఇచ్చే రోజును గుర్తుచేసుకోవాలన్నారు. "ఈ రోజు వారి త్యాగాలను గుర్తుచేసుకోవటానికి మరియు అటవీ సంపదను కాపాడటానికి కూడా ఉద్దేశించబడింది" అని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అటవీ సిబ్బంది కొరతపై జనవరి నాటికి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా 2,500 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధాన అటవీ కార్యాలయాన్ని నిర్మిస్తామని, అధికారులకు వాహనాలను త్వరలో మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అటవీ భూములను ఆక్రమించడం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు త్వరలో అటవీ భూముల అభివృద్ధికి కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రంలో 6,000 టన్నుల ఎర్రచందనం ఉంది. దీనిని వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని తెలిపారు. విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైన ముప్పు అని, దీనికి పెరుగుతున్న అటవీ విస్తీర్ణం మాత్రమే పరిష్కారం అని అన్నారు. అటవీ సిబ్బంది ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అధికారులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవాలని అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్ ప్రతీప్ కుమార్ అన్నారు. కాగా అటవీ సంపదను కాపాడటానికి ప్రాణాలు అర్పించిన 18 మంది అటవీ సిబ్బందికి మంత్రి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఎంపీ, పోలీసు కమిషనర్ ఆర్‌కె మీనా, ఇతర అధికారులు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories