Konaseema: గత 3 రోజులుగా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

For The Last 3 Days People Have Been Traveling On Natu Boats In Konaseema
x

Konaseema: గత 3 రోజులుగా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

Highlights

Konaseema: 10 మంది ఎక్కాల్సిన నాటు పడవలో 50 మంది వరకు ప్రయాణం

Konaseema: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో నాటు పడవ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలతో చాకలిపాలెం-కనకాయలంక దగ్గర వరద ప్రవాహానికి కాజ్వే మునిగిపోయింది. దీంతో.. గత 3 రోజులుగా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే.. కాజ్వే దగ్గర పోలీస్‌ పర్యవేక్షణ లేకపోవడంతో.. 10 మంది ఎక్కాల్సిన నాటు పడవలో 50 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. లైఫ్‌ జాకెట్లు లేకుండా పడవల్లో ప్రయాణం చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాజ్వే వద్ద తక్షణమే పోలీస్‌ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories