Ananthapuram: అనంతపురంలో త్వరలో ఫుడ్ ప్రోససింగ్ యూనిట్ల ఏర్పాటు

Ananthapuram: రెండు నెలల్లో ఫుడ్ ప్రోససింగ్ యూనిట్ల ఏర్పాటుపై శిక్షణ

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 5:16 PM IST
Food Processing Units Arrangements in Anantapur Soon
X
అనంతపూర్ లో త్వరలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Ananthapuram: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలను రెండు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు DRDO అనుబంధ సంస్థ డిస్టెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబరేటరీ శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతపురం లో ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పండించే వేరుశెనగ స్వీట్ ఆరెంజ్, టమోటా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన టెక్నాలజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందించి పారిశ్రామిక వేత్తలను తయారు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తలారి రంగయ్య చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story