నిన్న చంద్రబాబు టీమ్‌కు ప్రమాదం తప్పగా.. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ

*మధ్యాహ్నం 3.20కి విజయసాయిరెడ్డి ట్వీట్ *చంద్రబాబు జారిపడటమే తరువాయి అంటూ ట్వీట్‌

Rama Rao
Published on: 22 July 2022 12:07 PM IST
Flood Tour Between YCP and TDP Criticized | Andhra News
X

నిన్న చంద్రబాబు టీమ్‌కు ప్రమాదం తప్పగా.. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ

Andhra Pradesh: వైసీపీ, టీడీపీ మధ్య వరద పర్యటన విమర్శలు ప్రతివిమర్శలకు దారితీస్తోంది. నిన్న చంద్రబాబు టీమ్‌కు ప్రమాదం తప్పగా.. అది ముందే వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఎలా తెలుసంటూ కౌంటర్ వేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం సోంపల్లి రేవు వద్ద నీళ్లలో పడిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమ సహా పలువురు నేతలు నీళ్లలో పడగా ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు సాయంత్రం 5 గంటలకు పడవ ప్రమాదం జరిగిదే మధ్యాహ్నం 3.20కి విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జారిపడటమే తరువాయి అంటూ విజయసాయి చేసిన ట్వీట్‌ ను క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు కనీస భద్రత కల్పించలేదని.. పంటు నుంచి పడవలోకి చంద్రబాబును ఎందుకు మార్చారని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న ఉమ డిమాండ్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story