logo
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం
X
Highlights

పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం వస్తోంది. జూరాల నుంచి ఇన్ ఫ్లో 32,293 క్యూసెక్కుల..

పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం వస్తోంది. జూరాల నుంచి ఇన్ ఫ్లో 32,293 క్యూసెక్కుల నీళ్లు రావడంతో ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ ఔట్ ఫ్లో 58,074 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులలో నీరు ఉందని అధికారులు చెప్పారు.

జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు, మరోవైపు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఈ ఏడాది కృష్ణానది దాదాపు 30 రోజులపాటు పారింది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. మొత్తం ఐదుసార్లు క్రస్టు గేట్లను ఎత్తారు అధికారులు.

Web TitleFlood flow to Srisailam reservoir once again
Next Story