తూ.గో.జిల్లా రాజమండ్రిలో వరద ఉధృతి
Rajahmundry: సాయంత్రం ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్
తూ.గో.జిల్లా రాజమండ్రిలో వరద ఉధృతి
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 18లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా సాయంత్రం వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రవాహం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ముందస్తుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 15.3 అడుగులుగా ఉంది.
Next Story




