విజయవాడ వైసీపీలో ఫ్లెక్సీల రగడ

Arun Chilukuri
Published on: 20 Dec 2020 2:54 PM IST
విజయవాడ వైసీపీలో ఫ్లెక్సీల రగడ
X

విజయవాడ వైసీపీలో ఫ్లెక్సీల రగడ కలకలం రేపుతోంది. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్తా..ఇప్పుడు ప్లెక్సీలు చించుకునేవరకు వచ్చింది. సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలు విడిపోయి దాడులకు దిగారు. అయితే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను ఓ వర్గం వారు చించేశారు. దీంతో ఫ్లెక్సీల పంచాయతీ కాస్త పీఎస్‌కు చేరింది. 21వ డివిజన్ కార్పేరేటర్ అభ్యర్థిగా పుప్పాల కుమారిని దేవినేని అవినాష్ ఫైనల్ చెయ్యడంతో..అది నచ్చక మరో వర్గం ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story